Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ధాన్యం కొనే విషయంపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి
టీఆర్ఎస్, బీజేపీలు దొంగనాటకాలు ఆపాలి
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-మిర్యాలగూడ
రైతులకు కోపం వస్తే ప్రభుత్వాల పీటలు కదుల్తరు..నీనే గొప్ప వ్యక్తిగా చెప్పుకునే మోడీ రైతు ఉద్యమానికి తట్టుకోలేక చట్టాలను రద్దు చేసుకున్నారని, రైతులు కన్నీరు పెడితే ప్రభుత్వాల పతనం ఖాయమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రో.కోదం డరాంతో కలిసిమంగళవారం మహా పాదయాత్ర నిర్వహించారు. స్థానిక హనుమాన్‌పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి రాజీవ్‌చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు.అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు కలిసి కట్టుగా పొరడం వలన మోడీ దిగొచ్చాడని తెలిపారు.భవిష్యత్‌లో మళ్ళీ ఈ చట్టాలు తీసుకొచ్చే అవకాశం ఉన్నదని, రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ధాన్యం కొనే విషయంలో కేసీఆర్ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసు కెళ్లాలన్నారు. అందరు కలిసి మోడీపై ఒత్తిడి తెద్దామని కోరారు. బీజేపీ అంటే కేసీఆర్‌కు భయం పట్టుకుందని, కేంద్రం అవలంబిస్తున్న ప్రజావ్యతి రేకవిధానాలపై పోరాటాలు చేయడం లేదని విమర్శించారు. రైతులపై చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ వెంటనే తమ దగ్గర ఉన్న ఏడు వేల కోట్ల రూపాయల ధాన్యాన్ని కొనుగోలు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు.బీజేపీ, టీఆర్ఎస్ దొంగనాటకాలలను రైతులను ఆదుకోవాలన్నారు. యాసంగిలో వరి పంట సాగు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని, ఆయకట్టులో వరి తప్ప మరో పంట సాగు కాదని అలాంటప్పుడు ఆరు తడి పంటలు ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఐకేపీకేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఐకేపీకేంద్రాల్లో ధాన్యపు రాశులు పోసుకొని రోజుల తరబడి రైతులు పడిగాపులు కాస్తున్నారని పంటను కాపాడుకునేందుకు వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని వాపోయారు ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు యాసంగి లో వరి సాగు కు అనుమతి ఇచ్చి నీటి విడుదల షెడ్యుల్ ప్రకటించాలన్నారు యాసంగి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు దీని సాధన కోసం ఈనెల 9న హైదరాబాద్‌లో ధర్నా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.జెండాలు, పార్టీలకతీతంగా రైతులపక్షాన పోరాడిన ఐక్యంగా ముందుకు సాగుతామని తెలి పారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ స భ్యులు జూలకంటిరంగారెడ్డి మాట్లాడుతూ యాసంగి లో పండించిన అన్ని రకాల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో వరి ధాన్యం పండిస్తే ఆమ్మించే బాధ్యత తీసుకుంటానని ఎమ్మెల్యే భాస్కరరావు హామీ ఇచ్చారని సన్నరకంధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేస్తామని గతంలోనే ప్రకటిం చారన్నారు.సన్నరకంతో పాటు దొడ్డురకం ధాన్యాన్ని కూడా ఆమ్మించే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేష్ ,టీడీపీ రాష్ట్ర నాయకులు బండి వెంకటేశ్వర్లు, రైతుసంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, తెలంగాణజన సమితి రాష్ట్ర నాయకులు శ్రీధర్, సీపీఐ జిల్లా నాయకులు బంటు వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎం) నాయకులు రవి నాయక్,భావండ్ల పాండు, పరుశరాములు, మంగారెడ్డి, అయ్యూబ్, వరలక్ష్మీ, గోవర్థన, గాదె పద్మ, వినోద్‌నాయక్, పాదూరి శశిధర్‌రెడ్డి, తిరుపతి, రామ్మూర్తి, దేశీరామ్నాయక్, బాబునాయక్, టీజేఎస్ నాయకులు అంబటి నాగయ్య, శర్మ, సీపీఐ నాయకులు యాదగిరి, లింగానాయక్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.