Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆలేరుటౌన్
మలిదశ ఉద్యమంలో వ్యయప్రయాసాలకోర్చి స్వరాష్ట్రం సాధించేంతవరకు పట్టుదలతో పని చేసినా టీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర అశాంతి ,అసంతప్తితో ఉన్నారని, వారికి బీజేపీ స్వాగతం పలుకుతుందని జిల్లా కార్యదర్శి చిరిగె శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు .టీఆర్ఎస్ పతనం తప్పదని పేర్కొన్నారు .మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల మయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చారని తెలిపారు .ప్రజా సమస్యలపై పోరాడుతామని పేర్కొన్నారు .