Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎస్ ఫౌండేషన్ చేయూత
నవతెలంగాణ-పెన్పహాడ్
మండల పరిధిలోని లింగాల గ్రామానికి చెందిన అక్కచెల్లెళ్లు రణపంగ గౌతమి చదువులో, రణపంగ గాయత్రి క్రీడల్లో రాణిస్తున్నారు. ఈ మేరకు వారికి ఎస్ ఫౌండేషన్ చైర్మెన్ గుంతకండ్ల సునితజగదీష్రెడ్డి, మంత్రి తండ్రి రామచంద్రరెడ్డితో కలిసి ఆర్ధిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా సునీతజగదీష్రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎస్ ఫౌండేషన్ తరపున ఎంతో మంది చదువులు సాయం చేసినట్టు తెలిపారు. గౌతమి చదువు మొత్తం పూర్తయ్యే వరకు, గాయత్రి దారి ఖర్చులకు మొత్తం ఫౌండేషన్ తరపున ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. త్వరలో ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా భోజనం పెట్టి శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. అనంతరం ఇటీవలే మృతి చెందిన జూకురి లింగయ్య కుటుంబాన్ని పలువురు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నెమ్మాది భిక్షం, వైస్ ఎంపీపీ గార్లపాటి సింగారెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ నాతాల జానకీరాంరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు దొంగరి యుగేందర్, సర్పంచ్ మామిడి వెంకన్న, పీఏసీఎస్ డైరెక్టర్ గార్లపాటి స్వర్ణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దాచేపల్లి భరత్, టీఆర్ఎస్ మండల కార్మిక విభాగం అధ్యక్షులు రణపంగ సైదులు, దాచేపల్లి సుధాకర్, ఏసురాజు దుర్గయ్య, మామిడి నవీన్, మెహబూబ్అలీ పాల్గొన్నారు.