Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ హాజరైన మాజీ మంత్రి చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
పట్టణంలోని న్యూ దీప్తి హోటల్లో జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు అవగాహనా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశంలో మొట్ట మొదటి సారిగా కాంగ్రెస్ మాత్రమే డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టిందన్నారు. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రత్యేక చోరువ తీసుకొని నమోదు అయిన ప్రతి సభ్యునికి బీమా సాకర్యం కల్పించారన్నారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల్లోనూ దాదాపుగా ప్రతి బూత్ కి ఎన్రోలర్లను నియమించినట్టు తెలిపారు. మిగితా బూత్‌లలో కూడా ఎన్రోలర్లను నియమించాలని మండల అధ్యక్షలకు సూచించారు. ప్రతి బూత్ లో 100 మంది సభ్యులను నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు అయోధ్య రెడ్డి, ఉపేందర్ రెడ్డి , తంగాల్లపల్లి రవికూమర్, బీర్ల ఐలయ్య, రామాంజనేయులు గౌడ్, పోత్నక్ ప్రమోద్, ఎంపీపీ రమేష్ రాజ్, ఆలేరు మాజీ శాసన సభ్యులు డాక్టర్ నగేష్ మండల - పట్టణ అధ్యక్షులు కోట పెద్ద స్వామి, పటోళ్ల శ్యామ్ గౌడ్, పాక మల్లేష్ యాదవ్, బీసుకుంట్ల సత్యనారయణ, పాశం సత్తి రెడ్డి, రమేష్ గౌడ్, తడక వెంకటేష్ ,మండల, పట్టణ ్ట అధ్యక్షులుఎంపీపీలు,ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.