Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అఖిలపక్ష నాయకుల డిమాండ్
నవతెలంగాణ - సూర్యాపేట
ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్న ధాన్యానికి ప్రభుత్వం కనీస మద్దతు ధర చెల్లించాలని అఖిలపక్ష నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలోని కుడకుడ ఐకేపీ కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట- దంతాలపల్లి రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తేమ పేరుతో రైతుల ధాన్యాన్ని రోజుల తరబడి కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఓటీపీ పేరుతో రైతులను ఇబ్బందులు పెడుతున్నారని, దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేయాలని కోరారు. తూకాల్లో జరుగుతున్న మోసాన్ని అరికట్టాలని, రైతుల నుండి కొనుగోలు చేసే ధాన్యంలో తరుగు తీయొద్దన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు, తెలంగాణ జన సమితి సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జి కుంట్ల ధర్మార్జున్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్కుమార్, సీపీఐజిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ (చంద్రన్న వర్గం) జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కమిటి సభ్యులు కోట గోపి, చెరుకు యాకలక్ష్మి, వేల్పుల వెంకన్న, శ్రీకాంత్, సీపీఐ నాయకులు మూరగుండ్ల లక్ష్మయ్య, ధనుంజయ నాయుడు, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు రమాశంకర్ తదితరులు పాల్గొన్నారు.