Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భూదాన్‌పోచంపల్లి / భువనగిరి
రెండురోజులుగా భూదాన్ పోచంపల్లిలో జరుగుతున్న సీపీఐ(ఎం)జిల్లా ద్వితీయ మహాసభలు మంగళవారంతో ముగిశాయి. మొదటి రోజు ప్రతినిధుల సభ ప్రారంభమై రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రెండో రోజు జిల్లాలోని 17 మండలాలు 6 మున్సిపాలిటీలో ప్రజా సంఘాలు బాధ్యులు తమ నివేదికలను ప్రవేశపెట్టారు. సాయంత్రం జిల్లా కమిటీని ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. 35 మందితో జిల్లా కమిటీ సభ్యులు,11 మంది జిల్లా కార్యదర్శివర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా ఎండి.జహంగీర్‌ను రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా కొండమడుగు నర్సింహ, మంగనర్సింహ, మాటూరి బాలరాజుగౌడ్, కల్లూరి మల్లేశం, దొనూరి నర్సిరెడ్డి, బట్టుపల్లి అనురాధ, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు, మేక అశోక్ రెడ్డి, రొడ్డ అంజయ్యను, జిల్లా కమిటీ సభ్యులుగా దయ్యాల నరసింహ, సిర్పంగి స్వామి, మాయకష్ణ, బోల్లు యాదగిరి, మద్దెల రాజయ్య, ఎండి పాషా, జిల్లేడు పెంటయ్య, బూర్గు కష్ణారెడ్డి, పగిల్ల లింగా రెడ్డి, బబ్బురి పోలిశెట్టి, బొడ్డు పల్లి వెంకటేష్, యం. యాదయ్య, గుంటోజు శ్రీనివాసాచారి, గుండు వెంకట నర్సు, గంగాదేవి సైదులు, బండారు నరసింహ, దోడ్డ యాదిరెడ్డి, మధ్దేపురం రాజు, అహ్వరు రామేశ్వరి, రాచకొండ రాములమ్మ, గడ్డం వెంకటేష్, ఎంఎ ఇక్బాల్, వనం ఉపేందర్లను ఎన్నుకున్నారు.
కొండమడుగు నర్సింహ, మాటూరి బాలరాజు, బట్టుపల్లి అనురాధ, మేక అశోక్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్ ,రాష్ట్ర కమిటీ సభ్యులు ఫైళ్ల ఆశయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనూరి నర్సిరెడ్డి, కల్లూరి మల్లేశం ఆహ్వాన సంఘం అధ్యక్షులు గూడూరు అంజి రెడ్డి ,జిల్లా కమిటీ సభ్యులు దాసరి పాండు, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, మాయ కష్ణ, పెంటయ్య, దొడ్డ అంజయ్య ,ఎండి.పాషా, దయ్యాల నరసింహ, యాదగిరి, మద్దెల రాజయ్య ,కష్ణారెడ్డి పోశెట్టి స్వామి ,బొడ్డుపల్లి వెంకటేశం, వెంకటేష్, చారి వెంకట్ నర్స్, మండల కార్యదర్శి పగిళ్ల లింగారెడ్డి, పట్టణ కార్యదర్శి బాల నరసింహ, తదితరులు పాల్గొన్నారు.