Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మోత్కూర్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తోన్న విధానాలతో చేనేత కార్మికులకు ఆత్మహత్యలే శరణ్యమయ్యాయని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాశికంటి లక్ష్మీనర్సయ్య అన్నారు. బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి మాట్లాడారు. నూలు ధరలు పెరిగాయన్నారు. మార్కెట్లో చేనేత వస్రాలు అమ్మక పోవడంతో పాటు నేత కార్మికులకు పనిలేక పూట గడవడమే కష్టంగా మారిందన్నారు. చేనేతపై పెంచిన 12 శాతం జీఎస్టీని వెంటనే ఎత్తి వేయాలని, నూలుపై 40 శాతం రాయితీ కల్పించాలని, ప్రతి చేనేత కార్మికుడి పెట్టుబడి సహాయం కింద ఏడాదికి రూ.24 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్‌గౌడ్, చేనేత సంఘం జిల్లా కార్యదర్శి పోచం కన్నయ్య, నాయకులు జెల్ది రాములు, చుంచు లక్మయ్య, కొక్కుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.