Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి రూరల్
మండలంలోని అనాజీపురం - రావిపహాడ్ తండాకు వెళ్లే రహదారి గుంతలమయంగా మారింది. ఆ దారిలో మూసీ చిన్నెరువాగు వద్ద రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో వాగు చివరలో పెద్ద గుంత ఏర్పడింది. రెండు రోజుల క్రితం ఆ గుంతలో పడి ఓ ప్రయాణికుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. రాత్రి సమయంలో ఈ మార్గం గుండా ప్రయాణించాలంటే భయపడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ దారికి మరమ్మ తులు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
రోడ్డు మరమ్మతులు చేపట్టాలి
సందెల రాజేష్ - ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు
గుంతల మాయంగా మారిన రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి. లేని పక్షంలో ప్రజలతో కలిసి సంబంధిత కార్యాలయాన్ని ముట్టడిస్తాం.