Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సూర్యాపేట
భక్తి భావన క్రమశిక్షణను అలవాటు చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి తెలిపారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్ గ్రామంలో డీసీఎంఎస్ చైర్మెన్ వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో నిర్మించనున్న పెద్దమ్మ తల్లి దేవాలయ పనులకు మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడారు. గ్రామ దేవతల పండుగలతో ప్రజల్లో సామాజిక, సాంస్కతిక ఐక్యత ఏర్పడుతుందన్నారు. డీసీఎంఎస్ చైర్మెన్ వట్టే జానయ్యయాదవ్-రేణుక దంపతులు దేవాలయ నిర్మాణన్ని చేపట్టడం అభినంద నీయమన్నారు. దేవాలయ నిర్మాణ పనుల్లో ఎలాంటి అవాంతరాలూ లేకుండా సాఫీగా జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండ లాధ్యక్షులు వంగాల శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ వైస్ ప్రెసి డెంట్ చాంద్ పాషా, 13వ వార్డు అధ్యక్షులు రఫీ, సూర్యదేవాలయ చైర్మెన్ కాకులారపు జనార్ధన్, సునీల్‌రెడ్డి, రాపర్తి సైదులు, జనార్దన్, వల్లాల సైదు లు, పిల్లలమర్రి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.