Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
ఈనెల 10న జరుగనున్న స్థానిక సంస్థల శాసన మండలి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని బాలుర హైస్కూల్ నందు పోలింగ్ కంద్రాన్ని జాయింట్ కలెక్టర్ మోహన్‌రావు బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ ఈ నెల 10న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిర్వహిస్తున్నందున ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.నిబంధనల మేరకు త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా తాగునీరు, భోజనవసతి, పారిశుధ్యం తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎమ్మెల్సీ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. నియోజకవర్గంలోని ఐదుమండలాల ప్రజా ప్రతినిధులు ఇదే పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు.ఆయన వెంట ఆర్డీఓ కిశోర్‌కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్‌శర్మ, మున్సిపల్ కమిషనర్ నాగేంద్రబాబు, ఎంఈఓ సలీం షరీఫ్, ఇతరసిబ్బంది పాల్గొన్నారు.