Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగార్జునసాగర్
విద్యుత్ చట్టం సవరణ బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశ పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ ప్రదాన జలవిద్యుత్ కేంద్రం ముందు విద్యుత్ ఉద్యోగులు బుధవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనను వ్యక్తం చేశారు. విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల జాతీయ సమన్వయ కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా భోజన విరామసమయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.అనంతరం పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కొంతమంది ప్రైవేటు వ్యక్తుల లాభార్జనే ధ్యేయంగా విద్యుత్ సంస్థలను మరియు సహజ వనరులను ప్రైవేటు పరం చేయాలనే ఉద్దేశంతో విద్యుత్ సవరణ బిల్లును చట్టం గా మార్చాలని ప్రయత్నిస్తోందని, దీని వలన దేశ వ్యాప్తంగా సమస్త ప్రజానీకం, రైతాంగం మరియు విద్యుత్ ఉద్యోగులు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం ఈ ఒంటెద్దు పోకడ విధానాన్ని మరియు తన మొండి వైఖరిని విరమించుకోకపోతే, వర్క్ బై కాట్, మెరుపు సమ్మె లాంటి కార్యక్రమాలు కూడా చేయడానికి వెనకాడబోమని హెచ్చరి ంచారు.ఈ కార్యక్రమంలో ఎన్.సందీప్‌రెడ్డి, టి.వంశీకష్ణ, డి.వరప్రసాద్, టి.సులక్మి, రామకష్ణ, బి.రాజు, కష్ణప్రసాద్, టి.మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్, ఎం.సాంబశివరావు, టి.శ్రీను, నాగార్జున, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.