Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంవీఎన్ ట్రస్టు సేవలు అభినందనీయం
నవతెలంగాణ-నల్లగొండ
క్రీడల్లో గెలుపోటములను స్ఫూÛర్తిగా తీసుకొని క్రీడాకారులు ఆడాలని న్యాయమూర్తులు వెంక టేశ్వరరావు, వేణు పిలుపునిచ్చారు.బుధవారం జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో షటిల్‌బ్యాడ్మింటన్ ముగింపు కార్యక్రమం ట్రస్టు సభ్యులు తుమ్మల వీరా రెడ్డి అధ్యక్షతన నిర్వహి ంచారు.ఈ సందర్భంగా జడ్జీలు మాట్లాడుతూ క్రీడల్లో క్రీడాకారులు గెలుపుస్ఫూర్తితోనే ఆడాల న్నారు.ఆడిన ప్రతి ఒక క్రీడాకారుడు విజేత కాలేడని తెలిపారు.క్రీడలు క్రీడాకారులు ఆగడమే ఒక గెలుపు అని చెప్పారు.పిల్లల నుండి ఈ పోటీలలో 72 ఏండ్ల వయస్సు గల వారు కూడా ఆడడం చాలా గొప్ప విషయమని తెలిపారు.అలాగే ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రం 16 ఏండ్లుగా ఈ క్రీడలు నిర్ణయించడం, అనేక కార్యక్రమాలు చేయడం అభినంద నీయమన్నారు. కాంపిటేటివ్ పర్పస్‌లో కోచింగ్ ఇవ్వడం, ఎలా ప్రిపేర్ కావాలనే అంశాలపై శిక్షణ కూడా ఇచ్చారని గుర్తుచేశారు.ఎలాగైనా వివిధ వర్గాల ప్రజల అంశాలపై సేవచేయడం గొప్ప విషయమన్నారు.వీరు చేస్తున్న సేవలను వినియోగి ంచుకొని ఆదరించాలని పిలుపునిచ్చారు. ట్రస్ట్ సభ్యులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ కోవిడ్ కాలంలో తమ ట్రస్ట్ అనేక సేవలందించడం, ఆరోగ్య సహాయకేంద్రాలు పెట్టడం, ఐసోలేషన్ సెంటర్ పెట్టి వైద్య సేవలందించామని గుర్తు చేశారు. ఆక్సిజన్ అవసరం ఉన్నవారికి మిషనరీలను కూడా అందించిందని తెలిపారు.నేటికీ వైద్య సేవలు కొనసాగిస్తుందని తెలిపారు.2022 జనవరిలో గ్రామీణ క్రీడలను కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాగే విద్య తో పాటు మేం చేస్తున్న సేవలను ప్రజలు వినియోగించుకోవాలని పిలుపు నిచ్చారు. క్రీడలు జయ ప్రధానికి కషిచేసిన ఎం పరులకు, పోటీలలో పాల్గొన్న క్రీడాకారులకు, విజేతలకు అభినందనలు తెలిపారు.ఈ నాలుగు రోజుల కాలంలో సెటిల్ బ్యాట్మెంటన్ పోటీలలో మొదటి విజేతలుగా నిలిచిన అజరు, కార్తీక్ రెండో విజేతగా మనోజ్, నవీన్ మూడవ విజేతలుగా పంతులు శ్రీనివాస్, గౌతమ్ నాలుగో విజేతలుగా రవికుమార్, శ్రీనివాస్ గెలుపొందారు.అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో బండా శ్రీశైలం, పుచ్చకాయల నర్సిరెడ్డి, ఐఏఎస్ విశ్రాంతఅధికారి చొల్లేటి ప్రభాకర్, తహసీల్దార్లు, మంత్రి మహేందర్‌రెడ్డి, చేపూరి కష్ణయ్య,పబ్లిక్ ప్రాసిక్యూటర్ శంకర్, సీనియర్ క్రీడాకారులుమురళీధర్రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, పంతులు శ్రీనివాస్ పాల్గొన్నారు.