Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ-హాలియా
కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ నాటకాలు మాని రైతులు పండించిన పంటను మద్దతుధరకు కొనుగోలుచేయాలని, యాసంగిలో వరి వేసు కోవడానికి అనుమతులిచ్చి వారిని ఆదు కోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.బుధవారం నాగార్జునసాగర్ నియోజకవర్గ స్థాయి జనరల్ బాడీ సమావేశం పట్టణంలోని సుందరయ్యభవన్‌లో కొర్రా శంకర్ నాయక్ అధ్యక్షతన నిర్వహించారు. సమా వేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ఆమాట్లాడుతూ రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొంగనాటకాలాడుతూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు.వర్షాలు విస్తారంగా కురసి ప్రాజెక్టులు చెరువులు నిండి భూగర్భజలాలు పుష్కలంగా ఉండడంతో వరి మాత్రమే అనువైన పరిస్థితులు ఉన్నందున రైతన్న వరి మొగ్గు చూపు తున్నారని ప్రభుత్వాలు మాత్రం వరి కొనమని, సాగు చేయొద్దని బెదిరిస్తు న్నారన్నారు.2022 జనవరి 22 నుంచి 25 వరకు జరిగే సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ మహాసభల్లో ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొంది స్తామన్నారు.పార్టీ జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు కూన్‌రెడ్డి నాగిరెడ్డి, చినపాక లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలపై కార్యకర్తలు పోరాటా లకు సిద్ధంకావాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి దుబ్బ రామచంద్రయ్య, కందుకూరి కోటేష్, రైతుసంఘం జిల్లా నాయకులు కత్తి శ్రీనివాస్‌రెడ్డి, ఐద్వా జిల్లా నాయకురాలు దైద జానకమ్మ, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఆకారపు నరేష్, వివిధ మండలాల నాయకులు దోంతాల నాగార్జున, పరమేష్, పొదిలి వెంక్కన, రవి,రవీందర్, జగదీష్, కోరే రమేష్, పుల్లయ్య పాల్గొన్నారు.