Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చండూరు: ఎంతోకాలంగా విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 110 యూనియన్తోనే పరిష్కారమవుతాయని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం వెంకటయ్య అన్నారు.బుధవారం స్థానిక భారతి చంద్ర ఫంక్షన్హాల్లో ఆ సంఘం మునుగోడు సబ్‌డివిజన్ సర్వసభ్య సమావేశం నిర్వహి ంచారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రవిద్యుత్ సవరణ బిల్లు-2021 ఉపసంహరించుకోవాలని, ఈ బిల్లు వల్ల వినియోగదారులకు, ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. విద్యుత్‌రంగంలో సంస్క రణలు తీసుకొచ్చి ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తే మేం తీవ్రంగా ఉద్యమించి విజయం సాధిస్తామన్నారు.కేంద్రం ప్రతిపాదించే ఈ చట్టంపై సైతం ఇదే తరహాలో ఉద్యమిం చడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
1104 యూనియన్‌లోకి చేరికలు....
ఇతర యూనిట్ల నుండి 1104 యూనియన్‌లోకి బుధవారం ఏ.మాధవరెడ్డి, లింగయ్య,పలువురు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సమక్షంలో చేరారు.అనంతరం సబ్‌డివిజన్ ఎన్నికలు నిర్వహించారు.ఎన్నికల్లో మునుగోడు సబ్ డివిజన్ లీడర్‌గా ఎండి షాజ్జుపాషా, మునుగోడు సెక్షన్ లీడర్‌గా నర్సింహ, ఈఆర్వో సెక్షన్ లీడర్‌గా నయీమ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపుకార్యదర్శి టి.శ్రీని వాసులు, డివిజన్ నాయకులు చంద్రశేఖర్, ఆర్.బాలు, రవీందర్‌రెడ్డి, అయ్యూబ్, ఎండి షరీఫ్‌పాషా, ముత్తయ్య, వెంకన్న నిరంజన్అలీ, చంద్రమౌళి, సైదులుకుమార్ పాల్గొన్నారు.