Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూరు
టైక్వాండో ఛాంపియన్ షిప్-2021లో భాగంగా ఇటీవల జిల్లా స్థాయి ఇండోర్‌స్టేడియంలో జరిగిన పోటీలలో మున్సిపల్కేంద్రం నుండి కోచ్ నాగిళ్ల రమేష్ ఆధ్వర్యంలో 11 మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు.ఈ పోటీలో చెందిన ఇద్దరు గోల్డ్‌మెడల్స్, ఐదుగురు సిల్వర్‌మెడల్స్, నలుగురు బ్రాంచ్ సాధించినట్లు కోచ్ రమేష్ తెలిపారు.ఈ సందర్భంగా బుధవారం సీఐ మధు, ఎస్సై నరేష్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు భూతరాజు దశరథ విద్యార్థులను అభినందిం చారు.అనంతరం సీఐ మాట్లాడుతూ టైక్వాండో నేర్చుకోవడం ద్వారా విద్యార్థులు ఆత్మరక్షణతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందిం చుకోవచ్చన్నారు.