Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సూర్యాపేటరూరల్
రైతులు యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలు వేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి మహమ్మద్ జానిమియా కోరారు. బుధవా రం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కాసరబాద, పిల్లలమర్రి, రేఖ్యా నాయక్ తండా, సోలిపేట గ్రామాల్లో ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించి మాట్లాడారు. ఈ యాసంగి సీజన్లో రైతులు వరి పంటకు ప్రత్యామ్నాయంగా పెసర, మినుము, వేరుశనగ, పొద్దుతిరుగుడు, మంచి శెనగ వంటి పంటలు వేసుకోవాలని సూచించారు. యాసంగిలో ఎఫ్సీఐ ధాన్యం కొనుగోలు చేయడం లేదని, ఈ సారి కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయరని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవో ముత్తయ్య, పంచాయతీ కార్యదర్శి సలీం, సిద్దు, రైతులు కొల్లు నరేష్, వెంకట్రాములు, శంకరమద్ది రామిరెడ్డి, కారింగుల రాములు, రాచకొండ బిక్షం పాల్గొన్నారు.