Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు జూనియర్ సివిల్ జడ్జి దుర్గారాణి
నవతెలంగాణ రామన్నపేట
ఈనెల 9,10,11 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి కలిదిండి తులసి దుర్గారాణి కోరారు. బుధవారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ జాతీయ మెగా లోక్ అదాలత్లో రాజీ చేసుకోదగిన కేసుల్లో క్రిమినల్ కంపౌండబుల్, సివిల్ తగాదా, ఆస్తి విభజన, కుటుంబపరమైన నిర్వాహణ, వైవాహిక జీవితానికి సంబంధించిన, బ్యాంకు రికవరీ, టెలిఫోన్ రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్బౌన్స్తో పాటు ఇతర రాజీపడ్డ దగిన కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృధా చేసుకోవద్దన్నారు. ఆమె వెంట బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు ఉన్నారు.