Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మేక అశోక్‌రెడ్డి
నవతెలంగాణ - రామన్నపేట
యాసంగికి క్రాప్ హాలిడే ప్రకటించి, ఎకరానికి రూ.25 వేల పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మేక అశోక్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఆ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వరి పంటకు నారు పోసే సీజన్లో వరి వేయొద్దని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. రెండు నెలలు దాటినా మార్కెట్లో ఉన్న ధాన్యం కొనుగోలు చేయలేదన్నారు. నూక పేరుతో కొర్రీలు పెడుతూ బస్తాకు 3 నుంచి 5 కిలోల తరుగు తీస్తూ మిల్లర్లు రైతులను మోసం చేస్తున్నారన్నారు. రైతు సమస్యపై ఈ నెల 11న మార్కెట్ కేంద్రాల్లో రైతు దీక్షలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, రైతు సంఘం మండల కార్యదర్శి బోయిని ఆనంద్, నాయకులు బల్గూరి అంజయ్య, పండుగ రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.