Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీకాంత్వర్మ
నవతెలంగాణ - సూర్యాపేట
జిల్లా కేంద్రంలో అనుమతి లేకుండా నడుస్తున్న నారాయణ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ధనియాకుల శ్రీకాంత్వర్మ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ఎంవీఎన్ భవనంలో నిర్వహించిన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొద్ది కాలంగా అనుమతి లేకుండా జిల్లా కేంద్రంలోని బ్లూ బర్డ్స్ పాఠశాల వేదికగా నారాయణ విద్యా సంస్థల పేరుతో అడ్మిషన్లు తీసుకొని తరగతులు నిర్వహిస్తున్నారని తెలిపారు. వందలాది మంది విద్యార్థుల వద్ద ఫీజులు ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి నారాయణ విద్యా సంస్థ పేరుతో నడుస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో వినోదనాయక్, అజరు, రమేష్, ప్రసాద్, గోపి తదితరులు పాల్గొన్నారు.