Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మిర్యాలగూడ
కాంగ్రెస్‌ను గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలని కాంగ్రెస్ మండలాధ్యక్షులు చెన్నబోయిన శ్రీనివాస్ కోరారు. బుధవారం మండలంలోని తుంగపాడు, లావుడితండాల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు. ఈ సమావేశంలో సర్పంచ్ వెంకన్న, గ్రామాధ్యక్షులు వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ బలరాంనాయక్, శేఖర్‌రెడ్డి, లింగయ్యయాదవ్, శ్రీనివాస్, చినగోపిరెడ్డి, రవీందర్‌రెడ్డి, అనంతరెడ్డి, రెమిడాల శ్రీనివాస్, మధుసూధన్, కోటిరెడ్డి, కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.