Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరిసాగర్
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఖండ్గాం గ్రామంలో వీఆర్ఏ గౌతమ్‌ను హత్య చేసిన ఇసుకమాఫియా దుండగులను వెంటనే శిక్షించాలని కోరుతూ తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకసంఘం ఆధ్వర్యంలో బుధ వారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సంద ర్భంగా పలువురు నాయకులు మాట్లా డుతూ మృతుని కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రే షియా చెల్లించాలని కోరారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యో గంతో పాటు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించా లన్నారు.అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు బాలాజీ, భవాని, ఎల్.నర్సయ్య, ఎస్.నర్సయ్య, దుర్గాప్రసాద్, మంగమ్మ పాల్గొన్నారు.