Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -వలిగొండ
మండలంలోని మల్లెపల్లి గ్రామానికి చెందిన గ్రంథాలయ మాజీ చైర్మెన్ పల్లెర్ల ప్రకాష్ ఇటీవల అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆస్పత్రి ఖర్చులకోసం ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి తన సొంత నిధుల నుండి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని గురువారం ప్రకాష్‌కు అందజేసినట్టు టీఆర్ఎస్ మండలఅధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మెన్ కొనపురి కవిత, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ పడమటి మమత రెడ్డి, మహిళా మండలి అధ్యక్షురాలు మద్దెల మంజుల, నాయకులు గూడూరు శేఖర్ రెడ్డి ,ఎమ్మె లింగస్వామి, పోలే పాక సత్యనారాయణ పాల్గొన్నారు.