Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో దుర్మరణం చెందిన దేశ తొలి త్రి దళాధిపతి జనరల్ బిపిన్ రావత్‌తోపాటు మరో 13 మంది మరణించడంతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ గురువారం చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో జాతీయ రహదారిపై బిపిన్ రావత్ చిత్రపటానికి జెడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉబ్బు వెంకటయ్య, ఆ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ కొయ్యడ సైదులుగౌడ్, నాయకులు కాసర్ల శ్రీనివాస్‌రెడ్డి, తిరుపతి రవీందర్, చింతల సాయిలు, ఎస్కె.జానీబాబు, ఆవుల యేసు, బండమీది వెంకటేశం, బత్తుల లింగస్వామి, మలిగె మల్లేశం, సుర్కంటి బాలకష్ణారెడ్డి, కరీమ్, చెరుకు కష్ణ, రాపర్తి సైదులుగౌడ్, వల్కి దిలీప్, శివ, అశోక్‌నాయక్, ప్రవీణ్, మహేశ్ పాల్గొన్నారు.