Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మున్సిపల్ కేంద్రంలోని బందావన్ కాలనీలో ఇండ్ల మధ్యలోకి మురుగు నీరు చేరుతుండడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలేరు పట్టణ మున్సిపల్ గ ఏర్పడినప్పటికీ , మురుగు నీరు వెళ్లేందుకు కాల్వలు నిర్మించకపోవడంతో కాటమయ్య నగర్ నుండి బందావన్ గార్డెన్లో మురుగు నీరు వచ్చిచేరడంతో అపరిశుభ్రత వాతావరణం ఏర్పడి ంది. దోమలు అధికం కావడం, పందులు స్వైర విహారం చేస్తూ ఉండటంతో కాలనీ అంతా దుర్వాసన వస్తుందని కాలనీవాసులు చెబుతున్నారు. దారి వెంట మురుగునీరు కారణంగా పాదచారులకు, వాహనదా రులకు తీవ్ర ఇబ్బంది తలెత్తుతోంది .వెంటనే డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
డ్రైనేజీ నిర్మించాలి
లేగాల శ్రీధర్, కాలనీవాసి
కాటమయ్య నగర్ నుండి బందావన్ కాలనీ వైపు డ్రైనేజీ నిర్మాణం లేకపోవడంతో మురుగునీరు ఇండ్ల మధ్యలోకి వచ్చి చేరుతుంది. దోమలు అధికంగా పెరిగాయి. పందులు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నారులకు విషజ్వరాలు వస్తున్నాయి .సమస్యను వివరిస్తూ స్థానిక కౌన్సిలర్ గుత్తా శమంత రెడ్డికి ,మున్సిపల్ అధికారుల దష్టికి తీసుకువెళ్లాం,
డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టాలి , సమస్య పరిష్కరించాలి
ఎం సుధాకర్ కాలనీ వాసి
మున్సిపల్ కేంద్రంగా పట్టణం ఏర్పడినప్పటికీ అందుకు అనుగుణంగా అభివద్ధి నిర్మాణ పనులు జరగడం లేదు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది .మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు తక్షణం కల్పించుకొని వేగవంతంగా డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టాలి ప్రజల ఆరోగ్యం కాపాడాలి .