Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నకిరేకల్
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్మికులకు చెల్లించిన విధంగా ఏరియస్తో సహా కొత్త వేతనాలను మున్సిపల్ కార్మికులకు చెల్లించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కమిటీ సభ్యులు వంటే పాక వెంకటేశ్వర్లు మాట్లాడారు. నకిరేకల్ మునిసిపాలిటిగా మారి ఏడాది గడుస్తున్నా కార్మికులకు గ్రామపంచాయతీ వేతనాలు అమలు చేయడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు వి కష్ణ, పాలడుగు సైదులు, నల్లగొండ మారమ్మ, సైదమ్మ, లింగమ్మ, కొండయ్య, శంకరమ్మ, పుష్పమ్మ పాల్గొన్నారు.