Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బీబీనగర్
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేది కాంగ్రెసేనని ఆ పార్టీ మండల అధ్యక్షులు పొట్టోళ్ల శ్యామ్‌గౌడ్ అన్నారు. గురువారం పార్టీ అధినేత సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి బూతు నుండి 25 మందికి సభ్యత్వం కల్పించినట్టు తెలిపారు. రానున్న రోజుల్లో కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలను కాంగ్రెస్‌పార్టే గద్దె దించుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గూడూరు నిఖిల్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, సోమ శివకుమార్, వినీత్‌రెడ్డి, దొంతిరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.