Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
వయో వద్ధులు, వికలాంగుల సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వయోవద్ధుల, దివ్యాంగుల జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వయో వద్ధుల కోసం కౌన్సెలింగ్ నిర్వహించడానికి అవసరమయ్యే సైకాలిజిస్టులకు ప్రత్యేక ఇంటర్నిషిప్ కల్పించి నియమిస్తామని తెలిపారు. ట్రిబ్యునల్‌లో తీర్మానం కాని ప్రత్యేక కేసులను కూడా తమ స్థాయిలో పరిష్కరిస్తున్నట్టు తెలిపారు. వద్ధుల హక్కులకు ఎలాంటి భంగం కలిగించినా చర్యలు తీసుకుంటామన్నారు. వయో వద్దులెవరైనా సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే 14567 కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. కుటుంబ సభ్యులచే నిరాదరణకు గురైన వారి పోషణ భ్రతి కోసం రెవిన్యూ డివిజన్ స్థాయిలో ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దివ్యాంగులకు నిబంధనల మేరకు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, వివాహ ప్రోత్సాహకాలు, ఆర్థిక పునరావాస క్రింద బ్యాంకు లోన్లు, అర్హులైన వారికి బ్యాటరీ ఆపరేటర్ వీల్ చైర్స్, ట్రై సైకిల్స్ ఉపకరణాలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. వికలాంగుల కోసం ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒక మీ సేవ సెంటర్ ఏర్పాటు చేసి సహయకుడిని నియమిస్తామని తెలిపారు. దివ్యాంగుల అవసరాల నిమిత్తం 1800 572 8290 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు దివ్యాంగ వద్ధుల సంక్షేమ అధికారి శ్రీమతి కష్ణవేణి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి, వాటి అమలు, కమిటీ ఏర్పాటు, విధానాల గురించి వివరించారు.
బిపిన్ రావత్ కి ఘన నివాళులు
హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత త్రివిధ దళాధిపతి సీడీఎస్ బిపిన్ రావత్ సహా 13 మంది సైనికాధికారులకు సమావేశంలో రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ జెడ్పీ సీఈఓ కష్ణారెడ్డి, ఏసీపీ వెంకట్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివద్ధి అధికారి ఉపేందర్‌రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సాంబశివరావు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి, ఏఫ్ఆర్ఓ తిరుపతి రెడ్డి, ఫిజియో థెరపిస్ట్ శివ కుమార్, వయోవద్ధుల, దివ్యాంగుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
డిస్టిబూటర్స్ సెంటర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్
ఈ నెల 10న నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ల సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూటర్ సెంటర్‌ను కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, భువనగిరి ఆర్డీఓ భూపాల్ రెడ్డి, చౌటుప్పల్ ఆర్డీఓ సూరజ్ కుమార్, భువనగిరి తహసీల్దార్్ శ్యామ్ సుందర్ రెడ్డి పాల్గొన్నారు.