Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
పట్టణంలోని మాధవ నగర్ (పాతబస్తీ) జేబీఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఫిజిక్స్ స్కూల్ అసిస్టెంట్ వై.శ్యామ్ సుందర్ రెడ్డి విద్యార్థులకు గురువారం మాస్కులు, శానిటైజర్, పంపిణీచేశారు. ప్రధానోపాధ్యాయులు ధీరావత్ ధర్మానాయక్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారిని విద్యార్థులు సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే మంచి ఆహార నియమాలు, పరిశుభ్రత, సామాజిక దూరంపాటిస్తూ మాస్కులు తప్పనిసరిగా వాడాలని సూచించారు. అనంతరం శ్యాంసుందర్రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధీరావత్ ధర్మానాయక్ , ఉపాధ్యాయులు నర్సింహారెడ్డి, నాగిరెడ్డి, వెంకట్ రెడ్డి గిరిబాబు, రత్నమాల, పావని, ప్రతిమ, సిబ్బంది పాల్గొన్నారు.