Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు
చినపాక లక్ష్మీనారాయణ
నవతెలంగాణ -నల్లగొండ
గ్రామపంచాయతీ కార్మికులకు రూ.21వేల కనీస వేతనం అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవన్లో గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా విస్తతస్థాయి సమావేశం పోలె సాంబయ్య అధ్యక్షతన నిర్వమించారు. ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ కరోనా కాలంలో కూడా తమ ఆరోగ్యాలను ప్రాణాలను సైతం లెక్కచేయకుండా గ్రామాలలో అనేక సేవలు అందిస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు ముఖ్యమంత్రి ఇచ్చిన 11వ పీఆర్సీ హామీ మేరకు 21వేల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. మల్టీ పర్పస్ విధానం పేరుతో కార్మికులను సెలవులు పనిగంటలు లేకుండా బానిసలుగా పనిచేస్తున్నారని, ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. సమస్యల పరిష్కరించాలని ఈనెల13,14,15 తేదీలలో ఎంపీడీవో వినతి పత్రాలు, 20న కలెక్టరేట్ ధర్నా, వచ్చే జనవరి 6న చలో హైదరాబాద్ కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి పోతేపాక వినోద్ కుమార్, పొన్న అంజయ్య, ఎన్ నరసింహ, ఏర్పుల సైదులు, ఎర్ర అరుణ, గండమళ్ళ ఆశీర్వాదం, ఆర్ శ్రీనివాస్, ఎ.సైదులు, జ్యోతి, వెంకన్న, యన్.ఆంజనేయులు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.