Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
అఖిలభారత జాతీయ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామంలోని నిరుపేదలకు ఆర్థికసాయం అందజేశారు. మండలంలోని అల్లాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అర్ధ వెంకట్‌రెడ్డి సహకారంతో ఏర్పాటుచేసిన మొత్తం రూ.18వేలను అనారోగ్యంతో బాధపడుతున్న షేక్ జమీల్‌కు ఆరువేలు, కంటికి గాయంతో చికిత్స పొందిన షేక్ ఉస్మాన్‌కు ఆరువేలు, రోడ్డు ప్రమాదంలో గాయపడిన దేశెట్ల బిక్షంకు ఆరువేల రూపాయల చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వెంకట్‌రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ కొయ్యడ సైదులుగౌడ్, డీసీసీ కార్యదర్శి ఆకుల ఇంద్రసేనారెడ్డి, నాయకులు లందగిరి భీమయ్య, పాశం కష్ణ, ఎర్ర శంకర్, బద్రి బాలరాజు, కడుపు నర్సింహా, సుర్కంటి బుచ్చిరెడ్డి, దామోదర్‌రెడ్డి, గాలయ్య, సదానందం, శ్రీకాంత్ పాల్గొన్నారు.