Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
20 గ్రామ పంచాయతీలు, 50వేల పైచిలుకు జనాభా ఉన్న మర్రిగూడ మండలకేంద్రానికి అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే అంబులెన్స్ సౌకర్యం క ల్పించాలని మర్రిగూడ గ్రామ సర్పంచ్ నల్ల యాదయ్యగౌడ్ గురువారం జిల్లాకేంద్రంలో డీఎంహెచ్ఓ కొండల్రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉన్న 30పడకల ప్రభుత్వాస్పత్రి ఉన్నప్పటికీ అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో రోగుల రవాణా సౌకర్యార్థం కోసం అప్పటి కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆస్పత్రికి అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారన్నారు. కరోనా సమయంలో ఆ అంబులెన్స్‌ను జిల్లాకేంద్రానికి తీసుకువచ్చారని, తిరిగి అంబులెన్స్‌ను పంపించాలని కోరారు. అనంతరం మండల కేంద్రంలో ఉన్న శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి దేవాలయనికి నూతన పాలక వర్గం ఏర్పాటు చేసుకొనుటకు పత్రికా ప్రకటన ద్వారా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.వినతిపత్రం అందజేసిన వారిలో గ్రామస్థులు కొలుకులపల్లి యాదయ్య, వట్టికొటి శేఖర్, పగడాల ఆంజనేయులు, శ్రీనివాస్, లింగం, తదితరులు ఉన్నారు.