Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ - ఆలేరుటౌన్
జిల్లాలోని రైతులు ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల దష్ట్యా వరి పంటకు బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని యాదాద్రి భువనగిరి కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని సాయి గూడెం వద్ద వ్యవసాయ క్షేత్రాల వద్ద రైతులకు వరికి బదులు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై మండల వ్యవసాయాధికారులతో కలిసి అవగాహన కల్పించారు .ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రైతులు యాసంగిలో ధాన్యాన్ని ఎఫ్సీఐ కొనుగోలు చేయడంలేదన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు సిద్ధం కావాలన్నారు. అనంతరం ఉలవ ,ఆవాల పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ, జిల్లా వ్యవసాయ అధికారిణి అనురాధ, ఎడియే వేంకటేశ్వరరావు , ఏవో పద్మజ మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ కోటగిరి ప%శీ%డరీ ,మాజీ వైస్ ఎంపీపీ కె కిష్టయ్య,రైతులు మైల శ్రీశైలం, బేతి అంజిరెడ్డి, నోముల చంద్రయ్య, కే సత్తయ్య పాల్గొన్నారు.