Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎస్పీ రంగనాథ్
నవతెలంగాణ- నల్లగొండ
చేయూత పథకం పోలీస్ కుటుంబాలలో కొత్త వెలుగులు నింపడమే కాకుండా వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నదని నల్లగొండ ఎస్పీ ఏవి.రంగనాథ్ అన్నారు. గురువారం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఇటీవల మరణించిన కేతేపల్లి ఏఎస్ఐ సతీమణి లలితకు రూ.2లక్షల చేయూత పథకం చెక్కు ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చనిపోయిన పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన అన్ని రకాల లబ్ది సాధ్యమైనంత త్వరగా ఇప్పించేలా కషి చేస్తామని చెప్పారు. పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో చనిపోయిన పోలీస్ కుటుంబాల సంక్షేమం కోసం నిరంతరం కషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.