Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి
నవతెలంగాణ - హుజూర్‌నగర్‌టౌన్
ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి విమర్శించారు. బుధవారం సాయంత్రం మండల పరిధిలోని గోపాలపురం గ్రామంలో సిద్ధయ్య, వెంకటిలక్ష్మీ, నర్సమ్మ అధ్యక్షతన జరిగిన పార్టీ 7వ మండల మహాసభలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేండ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. విదేశీ బ్యాంకుల్లో దాచిన నల్ల ధనాన్ని తీసుకొచ్చి ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై భారం మోపిందన్నారు. ఇంటికో ఉద్యోగం, అర్హులైన వారికి డబుల్ బెడ్రూం, మూడెకరాల భూమి, ఉచిత వైద్యం హామీ అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రవినాయక్, కొలిశెట్టి యాదగిరిరావు, పులిచింతల వెంకట్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు బుర్రి శ్రీరాములు, అనంత ప్రకాష్, యాకూబ్, పాండునాయక్, నగేష్ నాగవరపు పాండు, ములకలపల్లి సీతయ్య, సైదులు, రైతు సంఘం నాయకులు పల్లె వెంకట్‌రెడ్డి, దుగ్గి బ్రహ్మం, చందాల బిక్షం, చేకూరి తిరుపతయ్య, మాధవరావు, వి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మండల కార్యదర్శిగా హుస్సేన్
సీపీఐ(ఎం) మండల కార్యదర్శిగా పోసణబోయిన హుస్సేన్ ఎన్నికయ్యారు. బుధవారం సాయంత్రం నిర్వహిం చిన ఆ పార్టీ మండల మహాసభలో ఆయన్ను ఎన్నుకున్నారు. ఆయనతో పాటు కార్యదర్శివర్గ సభ్యులుగా మాడురి నరసింహాచారి, చిన్నప్పరెడ్డి వెంకట్‌రెడ్డి, మీగడ రాములు, చింతకుంట్ల వీరయ్య, మండల కమిటీ సభ్యులుగా వేలంశెట్టి వీరస్వామి, తంగెళ్ల వెంకటచంద్ర, నూకల లక్ష్మీ నర్సమ్మ, కందాల బిక్షం, సిద్దుల వెంకటి, విజయ, నెట్టెం వెంకటేశ్వర్లు, ఖాసింలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.