Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన ఆస్పత్రి ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం
నవతెలంగాణ-మిర్యాలగూడ
పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలని శ్రీనివాస్ నగర్ సర్పంచ్ భోగవల్లి వెంకటరమణ చౌదరి కోరారు. గురువారం మండలంలోని శ్రీనివాస్‌నగర్‌లో మన ఆస్పత్రి ఆధ్వర్యంలో రెండు రోజుల వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పేదలకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఐదు రోజులకు సరిపడే మందులు ఉచితంగా అందజేశారు. మొత్తం 600 మందికి వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉచిత వైద్య శిబిరాలు ద్వారా వైద్య సేవలు అందించాలని కోరారు. కార్పొరేట్ స్థాయి వైద్యం తక్కువ ఖర్చుతో అందించి పేదల మన్ననలు పొందారన్నారు. అత్యాధునిక సౌకర్యాలతో వైద్య సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఆర్గనైజింగ్ మేనేజింగ్ డైరెక్టర్ విజరు కుమార్, డైరెక్టర్ ఇఫ్తేకార్, గ్రామస్తులు శ్రీనివాస్, జనార్ధన్, సత్యనారాయణ, నర్సింహారెడ్డి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.