Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జిల్లాలో పోలింగ్ శాతం 90.05.
అ మొత్తం ఓటర్లు 303, పోలైన ఓట్లు 288
నవతెలంగాణ - భువనగిరి
ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ యాదాద్రి భువనగిరి జిల్లాలో శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని భువనగిరి పోలింగ్ కేంద్రంలో 197 మంది ఓటర్లకు గాను 197 మంది ఓటు వేశారు. చౌటుప్పల్ పోలింగ్ కేంద్రంలో 106 మంది ఓటర్లకు గాను 91 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీపీఐ(ఎం) ఓటింగ్‌కు దూరంగా ఉండగా భువనగిరి మండలంలోని సీపీఐ(ఎం) అనాజిపురం ఎంపీటీసీ సభ్యురాలు కల్పన తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భువనగిరి మండలం నాగినేనిపల్లి ఎంపీటీసీ సభ్యులు బిజెపికి చెందిన రాజేందర్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వడం లేదని నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన తెలిపారు.
ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యేలు.
ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కష్ణారెడ్డి ఇ తమ ఓటు హక్కును వినియోగించుకోండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. సిపిఎంకు చెందిన పది మంది ఓటర్లు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. చౌటుప్పల్ బిజెపి ఎంపీటీసీ సభ్యురాలు మునగాల రాజేశ్వర్, బిజెపి పోచంపల్లి మున్సిపల్ కౌన్సిలర్ జ్యోతి, పోచంపల్లి టిఆర్ఎస్ జడ్పిటిసి సభ్యులు కోట పుష్పలత, చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యులు బద్దం కొండల్ రెడ్డి. ఓటు హక్కును వినియోగించుకోలేదు. స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ కె నగేష్ ముందుగానే వచ్చి తొలి ఓటును వేశారు. టిఆర్ఎస్ అభ్యర్థి తో పాటు ఉ క్రాస్ ఓటింగ్ ద్వారా ఓట్లు వస్తాయని నగేష్ ఆశలు పెట్టుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఓటింగ్ సరళిని పరిశీలించిన అధికారులు
ఓటింగ్ సరళిని ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్ అధికారి అహ్మద్ చౌటుప్పల్ పోలింగ్ కేంద్రాన్ని, భువనగిరి ఎన్నికల కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ తమిళ సత్పతి సందర్శించారు. పోలింగ్ బాక్స్ లను ఆర్ డి వో లు ఎన్ వి భూపాల్ రెడ్డి ఈ ఎస్ సూరజ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మధ్య నల్గొండ కు తరలించారు.
ఆశ నిరాశ : స్థానిక సంస్థల ఎన్నికలలో గతంలో మాదిరిగా డబ్బులు వస్తాయని ఆశపడ్డ స్థానిక ప్రజాప్రతినిధులు నిరాశ చెందారు చివరి నిమిషంలో టీిఆర్‌ఎస్ వారు క్యాంపు తీసుకుపోయారు. కాంగ్రెస్ వరకు ఎక్కడికక్కడ అ ఒక్కరోజు క్యాంపులు నిర్వహించుకున్నారు.
ఆలేరు : ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా శుక్రవారం ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి , ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి , మాజీ శాసనసభ్యులు జిల్లా జెడ్పీ ఫ్లోర్‌లీడర్ డాక్టర్ కె. నగేశ్ భువనగిరి పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
చౌటుప్పల్ : చౌటుప్పల్ డివిజన్‌కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. మొత్తం 106 ఓట్లకుగాను 91 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. పురుషులు 50, మహిళలు 56 మందికిగాను 42 మంది పురుషులు, 49 మంది మహిళలు ఓటువేశారు. సీపీఐ(ఎం)కు చెందిన కౌన్సిలర్లు, ఎంపీటీసీలు మొత్తం పది మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. బీజేపీకి చెందిన ఐదు ఓట్లలో ముగ్గురు ఓటింగ్‌లో పాల్గొనగా ఆరేగూడెం ఎంపీటీసీ, భూదాన్‌పోచంపల్లికి చెందిన కౌన్సిలర్ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఎక్స్ అఫీషియో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. విదేశాల్లో ఉండడంతో పెద్దకొండూరు ఎంపీటీసీ, భూదాన్‌పోచంపల్లి జడ్పీటీసీ ఓటింగ్‌లో పాల్గొనలేదు. మొత్తం 85.85శాతం ఓటింగ్ నమోదైందని ఆర్డీఓ సూరజ్‌కుమార్ తెలిపారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు నదీమ్ అహ్మద్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు.