Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి, కాంగ్రెస్ జెడ్పీటీసీ కె.నగేష్
నవతెలంగాణ- నల్లగొండ
కాంగ్రెస్ అగ్రనేతలపై కార్యకర్తలు గుర్రుగా ఉన్నారని ఉంటూ స్థానిక సంస్థల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి, కాంగ్రెస్ జెడ్పీటీసీ కుడుదుల నగేశ్ అన్నారు.శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ తానుపోటీలో ఉండకపోతే టీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవం అయ్యే వాడని తెలిపారు. టీఆర్ఎస్ అన్ని ప్రయోగాలు చేసిందన్నారు. నల్లగొండ జిల్లాలో పీసీసీ చీఫ్ కావలనుకునే వారు ఇప్పటికే అయిన వారు ఎంపీలుగా ఉండి కూడా పార్టీని పట్టించు కోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి సొంతగా 300ఓట్లకు పైచిలుకు ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ గాలికి వదిలేస్తుందని విమర్శించారు. వాళ్ళు ఎంపీలు గెలుస్తారు కానీ కాంగ్రెస్ నుంచి గెలిచిన కింది స్థాయి వారు ఎవరికి ఓటు వేయాలో చెప్పలేక పోయారని ఆరోపించారు. తెర వెనుక చాలా రాజకీయాలు చాలా చేశారని దీని వల్ల కాంగ్రెస్ నేతలు ఎవరికి మేలు చేస్తున్నారో జిల్లా ప్రజలకు తెలుసునని తెలిపారు. ఇన్ని రోజులు కాంగ్రెస్ నేతలు ప్రజలను, కార్యకర్తలను మబ్బుల్లో ఉంచారని దుయ్యబట్టారు .టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం కాంగ్రెస్ నేతలు వంద శాతం పనిచేశారన్నారు. తాను స్వతంత్ర అభ్యర్దినే అయినా కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అయినప్పటికీ పార్టీ నేతలు బహిరంగంగా మద్దతు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు ఇంతటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఎందుకు ఉన్నారో జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జిల్లాలో ఇద్దరు ఎంపీలు ఉన్న జిల్లా ఇది ఒక్కటే. అయిన కూడా కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఏమి లేదని నిరూపించుకునే ప్రయత్నం చేశారన్నారు. వాళ్ళ ఎన్నికల్లో మాత్రం కార్యకర్తలు జెండాలు పట్టుకుని పనిచేయాలన్నారు. ఓటర్లు చాలా స్పష్టంగా ఉన్నారు కానీ హక్కుల కోసం నిలబడాలని కోరుకున్నారు . కానీ డబ్బులు, అధికారం ఉందన్న కోణంలో టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారని ఆరోపించారు. తాను బరిలో నిలిచినందుకు కాంగ్రెస్ నేతలే బాధపడ్డారని సందర్భంగా తెలిపారు.