Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
చెరువు కాల్వలు పూడ్చిన రియల్టర్ పై చర్యలు తీసుకోవాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు. వివరాలను పరిశీలిస్తే భువనగిరి మండలంలోని అనాజిపురం గ్రామంలో చెరువు నుంచి వెళ్లే కాల్వ పక్కనే హెచ్ఎండిఎ వెంచర్ నిర్మాణం చేశారు. చెరువు నుంచి రైతులు పొలాలకు వెళ్లే కాల్వల్లో పూడ్చివేసారని గ్రామస్తులు రైతులు ఆరోపిస్తున్నారు. వెంచర్ యజమానులు ఏకపక్షంగా చెరువు నుంచి వెళ్లే కాల్వలను పూడ్చివేయడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎం డి ఎ వెంచర్ కు స్థలం పంచాయతీకి సామాజిక అవసరాలకు, కేటాయించవలసి ఉండగా , చెరువు నుంచి వెళ్లే కాల్వలు భూములపై పార్కులు నిర్మించి నీరు వెళ్లకుండా చేస్తున్నారని రైతుల ఆరోపణ. ఇప్పటికైనా స్పందించి మంచినీళ్లు వెళ్లా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.