Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రామన్నపేట
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను మండలంలోని సీపీఐ (ఎం)కి చెందిన ముగ్గురు ఎంపీటీసీలు ఆ పార్టీ జిల్లా నాయకత్వం తీసుకున్న నిర్ణయం మేరకు శుక్రవారం ఓటు వేయకుండా బహిష్కరించారు. ఆ పార్టీ జిల్లా నాయకత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఓటు వేయకుండా వ్యవహరించామని మండలంలోని నిర్నేముల ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, సిరిపురం ఎంపీటీసీ బడుగు రమేష్, వెల్లంకి ఎంపీటీసీ ఎర్రోళ్ల లక్ష్మమ్మ నరసింహ తెలిపారు.