Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
నారాయణపురం మాజీ సర్పంచ్ బద్దుల కష్ణయ్య జ్ఞాపకార్థం చారిటబుల్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ట్రస్ట్ అద్దె భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పేద మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు వడ్డేపల్లి రాములు,కార్యదర్శి బద్దుల మురళీ, సభ్యులు మందుగుల బాలకష్ణ,బద్దుల శ్రీధర్, రాసాల యాదయ్య, రామ్ నరేష్ , మునుగాల గోవర్ధన్ రెడ్డి, ఉప్పల వెంకటేష్, డెలివేరి శంకర్, నల్లబోతు చైతన్య, చింతల వెంకటేష్,విడెం రామకష్ణ, నల్లబోతు సురేష్,బద్దుల సంతోష్,రామ్ దేవ్, తదితరులు పాల్గొన్నారు.