Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
నల్గొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని శుక్రవారం రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియపై ఎన్నికల సిబ్బందిని ఆడిగి ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలోని పోలింగ్ ప్రశాంతంగా కొనసాగిందన్నారు. ఆయన వెంట ఆర్డీఓ జగదీశ్వరెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ నాగార్జునరెడ్డి తదితరులు ఉన్నారు.
వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్న ఎన్నికల పరిశీలకులు అహ్మద్ నదీమ్
నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ సరళిని శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్లో రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి ఎన్నికల పరిశీలకులు అహ్మద్ నదీమ్ వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు . ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే ,ఛైర్మెన్
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి,కౌన్సిలర్లు ఎంపీటీసీలుతో వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.