Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నార్కట్పల్లి
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం అని నల్లగొండ జెడ్పీ చైర్మెన్ బండ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల , నందు ఏర్పాటుచేసిన స్థానిక సంస్థల శాసన మండలి పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య నార్కట్ పల్లి ఎంపీపీ సూది రెడ్డి నరేందర్ రెడ్డి, చిట్యాల ,నార్కట్ పల్లి ఎంపీటీసీ తో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.