Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భువనగిరిరూరల్
మండలంలోని తుక్కాపూర్ గ్రామంలో సుమారు 10 ఎకరాల్లో ఏర్పాటు చేసిన బహత్ పల్లె ప్రకతి వనాన్ని శుక్రవారం సీఎంఓ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి సందర్శించారు. సుమారు పది ఎకరాల స్థలంలో ఉపాధి హామీలో రెండేండ్లకుగాను నీటి వసతి, ఖర్చులు, ప్లాంటేషన్ పనులకు, రోడ్డు నిర్మాణాలకు సుమారుగా రూ.45 లక్షల నిధులతో 31,000 మొక్కలను నాటించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బహత్ పల్లె ప్రకతి వనం పూర్తిస్థాయిలో పూర్తి కావడం పట్ల జిల్లా కలెక్టర్‌ను, భువనగిరి ఎంపీడీవో, ఉపాధి హామీ సిబ్బందిని ఆమె అభినందించారు. మొక్కల సేకరణ ను మండల వ్యాప్తంగా 34 గ్రామ పంచాయతీల నుంచి ఉపాధి హామీలో ఏర్పాటుచేసిన నర్సరీలో నుంచి సేకరించి 31 వేల మొక్కలు నాటడం పట్ల , నిర్వహణను చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ బహత్ పల్లె ప్రకతి వనం ఆదర్శంగా ఉందని కొనియాడారు. మొక్కల సేకరణ, నాటడం, పెంపకం నిర్వహణ తీరు ఇతరులకు ఆదర్శంగా ఉందని, అవసరమైతే మొక్కల పెంపకం పై పల్లె ప్రకతి వనాన్ని మోడల్ గా చూపించవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, అడిషనల్ డీఆర్డీఓ నాగిరెడ్డి, ఉపాధిహామీ ఏపీడీ శ్యామల, ఎంపీడీవో నరేందర్ రెడ్డి, ఉపాధి హామీ ఏపీవో బాలస్వామి, టెక్నికల్ అసిస్టెంట్లు వై రామచంద్రయ్య చారి, పంచాయతీ కార్యదర్శి రాజు పాల్గొన్నారు.