Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేవరకొండ :వైద్యం అందక బాలుడు మతి చెందిన సంఘటన శుక్రవారం పట్టణంలో చోటు చేసుకుంది.బాలుని తల్లిదండ్రుల వివరాల ప్రకారం...నాంపల్లి మండలం గానుగుపల్లికి చెందిన కష్ణవేణి రమేష్ల కుమారుడు అనారోగ్యంతో అర్థరాత్రి 3 గంటలకు ఏడవడంతో వెంటనే దేవరకొండకు ఆటోలో తరలించారు.బాలుడు పుట్టినప్పట్నుంచి వైద్యం అందిస్తున్న ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు.డాక్టర్ పిలిచినప్పటికీ రాకపోవడంతో బాలుడి పరిస్థితి విషమించడంతో ప్రభుత్వాస్పత్రికెళ్లి అక్కడ డ్యూటీలోనున్న వైద్యుడు చూసి మొదట్నుంచి ఎక్కడ చూపించారో అక్కడే చూపించాలని తిరిగి పంపించారు.తిరిగి మళ్లీ అదే ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా మరోసారి డాక్టర్ను పిలిచినప్పటికీ రాలేదు.దీంతో వైద్యమందక బాలుడు మతి చెందినట్టు వాపోయారు.