Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నెస్పీ ఎస్ఈ ధర్మానాయక్
నవతెలంగాణ-నాగార్జునసాగర్
ఆధునిక దేవాలయంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు వర్ధిల్లుతుందని ఎన్నెస్పీ ఎస్ఈధర్మానాయక్ అన్నారు.ప్రపంచప్రఖ్యాతి గాంచిన నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు ఆంధ్రరాష్ట్ర అన్నపూర్ణగా రైతులపాలిట కల్పతరువునాగార్జున సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన చేసి 66వసంతాలు నిండి 67వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్బంగా ఎన్ఎస్పీ అధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం సంబురాలను ఘనంగా నిర్వహించారు.నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలో ప్రాజెక్ట్ నిర్మాణంలో అసువులుబాసిన శ్రామికులు, ఇంజనీర్ల స్మారకస్థూపం వద్ద పూల మాలలతో నివాళులర్పించారు.అనంతరం డ్యామ్ ఎస్ఈ ధర్మానాయక్ మాట్లాడుతూ 67 వసంతంలోకి అడుగుపెడుతున్న నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఎటువంటి విదేశీసాంకేతిక సహకారం లేకుండా పూర్తిగా భారతీయ ఇంజనీర్లు రూపకల్పన చేశారన్నారు.దాదాపు 500 మంది ఇంజనీర్లు, 5000 మంది సాంకేతిక వర్క్ చార్జెడ్ సిబ్బంది 45 వేల మంది కూలీలు ఈ ప్రాజెక్టులో పని చేశారని గుర్తుచేశారు.రికార్డు సమయంలో 12 ఏండ్లకు ప్రాజెక్టు పూర్తి చేశారని, కేవలం రూ.127 కోట్లతో ప్రాజెక్టు పూర్తయ్యిందని తెలిపారు.ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాజెక్టు, రెండోది విద్యుత్తు ఉత్పాదన, మూడవది ప్రస్తుతం తాగునీరు రాష్ట్ర రాజధానికి అందిస్తున్నదన్నారు.నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణం ఇంజనీర్ల ప్రతిభకు తార్కాణ మన్నారు.డాక్టర్ కెఎల్‌రావు ఆధ్వర్యంలో ప్రాజెక్టు రూపకల్పన చేయబడిందన్నారు.ప్రాజెక్టు తొలి చీఫ్ ఇంజనీర్ హైదరాబాద్‌కు చెందిన మీర్ జాఫర్అలీ, తదుపరి మేజర్ రంగనాథస్వామితో పాటు ఎంతోమంది ఇంజనీర్లు నిర్మాణంలో పాలు పంచుకున్నారన్నారు. ప్రపంచంలోనే ఇదొక అద్భుత రాతి కట్టడంగా 67వ వసంతంలోకి అడుగుపెట్టిన ప్రాజెక్టు లక్షలాది ఎకరాలకు జలాలను అందిస్తూ కోట్లాది టన్నుల ఆహార ధాన్యాలను పండించే ధాన్యాగారంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు వర్ధిల్లు తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్నెస్పీ, ఏడీలు, ఏఈలు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.