Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
శబరిమల అయ్యప్పస్వామి మహాపడి పూజ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.జిల్లా కేంద్రంలోని 32 వార్డులో టీఆర్ఎస్ తుంగతుర్తి మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య నివాసంలో ఆయన కుమారుడు తాటికొండ క్రాంతికుమార్ అయ్యప్ప మాల వేసుకొనగా ఆదివారం అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రత్యేకంగా 18 మెట్లతో ఏర్పాటు చేసిన మండపంలో అయ్యప్ప స్వామికి నల్గొండకు చెందిన వనమా మధుసూదన్ గురుస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక మహా పడి పూజ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ పాల్గొని పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి యలగందుల వేంకటేశ్వర్లు, కౌన్సిలర్ జహీర్, లింగమంతుల స్వామి దేవాలయ చైర్మెన్ కోడి సైదులు, నాయకులు నాగభూషణం, శంకర్, కొల్లూరు బాలకష్ణ, తాటికొండ రామకష్ణ,సైదులు, బొమ్మిడిసురేందర్, గుండగానిదుర్గయ్య, తునికిసాయిలు, గుణగంటియాదగిరి,ఆకారపు భాస్కర్, కలకోట లక్ష్మణ్ పాల్గొన్నారు.
.