Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పేటలో యథేచ్ఛగా మాంసం విక్రయాలు
విక్రయకేంద్రాల వద్ద కనిపించని సామాజికదూరం
తూతూమాత్రంగా మున్సిపల్ అధికారుల తనిఖీలు
'నవతెలంగాణ' కథనానికి స్పందన
నవతెలంగాణ-సూర్యాపేట
పస్తుత పరిస్థితులు ప్రజలను అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా,ఓమిక్రాన్ వంటి వ్యాధులతో ప్రజారోగ్యం క్షీణిస్తున్న దృష్ట్యా కొందరు కొన్నింటికి దూరమయ్యారు.అందులో ముఖ్యంగా మాంసానికి దూరమైన వారు లేకపోలేదు.కానీ మాంసంప్రియులు మాత్రం మాంసం తినాలంటే ప్రత్యేకశ్రద్ధ చూపు తున్నారు.వారు ఆదివారం వచ్చిందంటే మాంసాహార విక్రయకేంద్రాల వైపు పరుగులు పెడుతున్న విషయం పెడుతుంటారు.నిని ఆసరాగా చేసుకున్న కొందరు మాంసపువిక్రయదారులు సొమ్ము చేసుకుంటున్నారు. ధరలనియంత్రణ లేకుండా కొనుగోలుదారులకు నాణ్యత లేని మాంసాన్ని అంతగడుతున్నారు.దానిపై అవగాహన లేని కొనుగోలు దారులు మాసం తీసుకెళ్లి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు.ఇందుకు సంబంధిత మున్సిపల్ శాఖ అధికారులు మాంసం విక్రయాలపై తొంగి చూడక పోవడంతో వ్యాపారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరి స్తున్నారు.ప్రతి ఆదివారం ఇలాగే జరుగుతుందని ముందస్తుగా చెప్పినప్పటికీ అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు చేసినట్టు తెలుస్తోంది.
మాస్కులు సరే...సామాజికదూరమేది...?
మాంసంవిక్రయకేంద్రాల వైపు ఆదివారం వేల మంది కొనుగోలుదారులు సహజంగానే వచ్చి వెళ్తుంటారు.కానీ కొందరుమాంసపు షాపు యజ మానులు మాత్రం ప్రస్తుతం ఉన్న వ్యాధులు తమకేమీ తెలియనట్లుగా వ్యవహరించారు.కనీసం మాస్కులు కూడా ధరించకుండా మాంసాన్ని విక్రయిస్తున్నారు. వచ్చిన వారితో మాటమాట కలిపి తమవ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అందుకు సంబంధితశాఖ అధికారుల నుంచి ఒత్తిడి లేకపోవడం, మాంసపు నాణ్యత పరిశీలన చేయకపోవడం,తనిఖీలు నిర్వహించకపోవడంతో వ్యాపారులకు అస్సలు భయమే కనిపించకుండా పోయిందని తెలుస్తోంది.
కేవలం 60 జీవాలు మాత్రామే కోశారట...
జిల్లాలో ఎక్కడా లేని మాంసపు ప్రియులు జిల్లాకేంద్రంలో ఉన్నారంటే అతిశయోక్తి లేదు.అందుకు ఆదివారం వచ్చిందంటే సుమారు వెయ్యికి పైగానే మేకలు,గొర్రెలు,పొట్టేళ్లు వదిస్తుంటారు.రాజీవ్‌నగర్, జమ్మిగడ్డ,సీతారాంపురం,మార్కెట్ రోడ్డు,తాళ్లగడ్డ,కుడ కుడ రోడ్డు,ఖమ్మం రోడ్డు ప్రాంతాల్లో విక్రయ కేంద్రాలు ఉన్నాయి.వీటిల్లో అధికంగా కుడకుడ రోడ్డు,రాజీవ్ నగర్,మార్కెట్ రోడ్డులో విక్రయిస్తుంటారు.
ఆదివారం వచ్చిందంటే కేవలం కుడకుడ రోడ్డులోనే సుమారు 300లకు పైగా మేకలు,గొర్రెలను వధిస్తుంటారు.ఇక మిగిలిన ప్రాంతాల్లో ఎన్ని వధించి ఉంటారో అంచనా వేసుకోవచ్చు.కానీ ఆదివారం మున్సిపల్ శాఖ ముద్ర కలిగి ఉన్న జీవాలుమాత్రం కేవలం 60 మాత్రమే అని తెలిసింది.కాగా ఒక జంతువు ఒక్కంటికీ రూ.10 ఉండగా 60 జీవాలకు ఆదివారం కేవలం రూ.600 మాత్రమే.అయితే జిల్లాకేంద్రంలో కేవలం 60 జీవాలను వధించారంటే నమ్మశక్యం కానీ విషయం. ఎలానంటే ఆదివారం వచ్చింది అంటే కుడకుడ రోడ్డులోలేనే ఒక్కొక్కరు సుమారు 8 నుండి 10 వరకు పొట్టేళ్లు, మేకపోతులను వధిస్తారనే విషయం తెలియనిది కాదు.అలా చూస్తే మిగిలిన జీవాల రశీదు బిల్లుల డబ్బులు ఎటు పోయినట్లు అనే అనుమానం కలుగుతోంది.అంటే వారి దగ్గరికి వచ్చిన జీవాలకు మాత్రమే అధికారులు, సిబ్బంది బాద్యులా..అనేది ప్రజలకు చెప్పాల్సి ఉంది.ఇదే జరిగితే ఎవరైనా ఎక్కడైనా జీవాలను వధించుకోవచ్చనే సంకేతాలు మున్సిపల్ శాఖ నుండే వెలుబడుతున్నట్టు తెలుస్తోంది.
'నవతెలంగాణ' కథనానికి స్పందన
ఆదివారం 'నవతెలంగాణ' దినపత్రికలో వచ్చిన కథనంపై మున్సిపల్ శాఖ అధికారులు,సిబ్బంది వెంటనే కొన్ని ప్రాంతాల్లో స్పందించారు.నిబంధనలకు విరుద్ధంగా మాంసం అమ్మకాలు జరిపే వారికి జరిమానా విధించారు.కానీ మాసం విక్రయదారులకు వేసే జరిమానాలకు వారు భయపడడం లేదనేది స్పష్టమవుతుంది.ముఖ్యంగా ఎక్కడ పడితే అక్కడ కోసి వారిపైన చర్యలు తీసుకొని,ఒకే ధరను నిర్ణయిస్తే బాగుంటుందనేది సమాచారం.ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్డువెంట మాంసం అమ్మేవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం పట్ల ప్రజలఆరోగ్యానికి హానికరం కావొచ్చు.దానికి మున్సిపల్అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందని ప్రజలు బహిరంగంగగానే చెబుతున్నారు.