Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగార్జునసాగర్
నందికొండ మున్సిపాలిటీ ఆరోవార్డుకు చెందిన 9వ తరగతి విద్యార్థిని నాగమల్లేశ్వరి రాష్ట్ర స్థాయికి ఎంపికవడం గర్వకారణమని టీఆర్ఎస్ ఎస్సీ సెల్ జిల్లా నాయకులు ఆదాసు విక్రమ్ అన్నారు.అనంతరం నాగమల్లేశ్వరిని అభినందించి శాలువాతో ఘనంగా సత్కరించి స్వీట్లు పంపిణి చేశారు. అనంతరం మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదాలు జరగకుండా సిగల్ సహాయంతో డ్రైవర్లను అప్రమత్తం చెయ్యటం అనే కొత్త కాన్సెప్ట్ తయారుచేసి చిన్న వయస్సులోనే రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఇలాంటి పేద కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వారిని ప్రోత్సహిస్తే ఉన్నతస్థాయికి వెళ్ళడం ఖాయమని తెలిపారు.నాగమల్లేశ్వరి రాబోయేతరాలకు ముందుచూపుగా నిలవాలని కోరారు.ఉపాధ్యాయులకు చిన్నారికి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మందకిషోర్, పిట్ట సైదులు, చిత్రం శ్యాము,శివకుమార్, జైరాజు, విద్యాసాగర్‌రెడ్డి,ఎలివేష, నాగలక్ష్మి, సైదమ్మ, అచ్చమ్మ, తల్లిదండ్రులు వెంకన్న, మంజుల తదితరులు పాల్గొన్నారు.