Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మునగాల:మునగాల రామలింగేశ్వర దేవాలయంలో పురాతన దేవతవిగ్రహాలు లభ్యమ య్యాయి. దేవాలయ ఖాళీస్థలంలో స్టోర్ రూమ్ల నిర్మాణం కోసం ఆదివారం జేసీబీతో బునాదులు తవ్వుతుండగా 5అడుగుల లోతున చుట్టూ రాయి పేర్చి అందులో భద్రపరిచిన 17 విగ్రహాలు లభ్యమయ్యాయి. వెంకటేశ్వరస్వామి, పద్మావతి, అలివేలు మంగ,శ్రీకష్ణుడు, శ్రీదేవి, భూదేవి, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, గరుత్మంతుడుతో అల్వార్ విగ్రహాలు బయటపడ్డాయి.ఈ విగ్రహాలు 500 నుండి 6 00 ఏండ్ల రాజుల కాలంనాటివి అయ్యి ఉండొచ్చని పురోహితులు వారణాసి బుచ్చిరామయ్య తెలిపారు.ఎంతో విశిష్టత కలిగిన ఈ విగ్రహాలపై గ్రామస్తులు ఎంతో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.