Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాంపల్లి
కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక నిరంకుశ విధానాలపై అవిశ్రాంతంగా పోరాటం చేసి విజయం సాధించిన రైతు ఉద్యమ స్ఫూర్తితో పార్టీ కార్యకర్తలు ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం,చినపాక లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.ఆదివారం పార్టీ మండలకమిటీ సమావేశం వాసిపాక ముత్తిలింగం అధ్యక్షతన నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అనేకవాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ, కేసీఆర్లు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కి పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు.కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ దేశసంపదను కార్పొరేట్శక్తులకు దోచిపెట్టేందుకు ప్రయివేటీకరణ విధానాలను అనుసరిస్తున్నారన్నారు.అందులో భాగంగానే బ్యాంకులు, ఎల్ఐసీ, విమానయానం, రైల్వే, గనులు, భూములు, రక్షణరంగాన్ని కూడా అప్పనంగా అమ్ముతున్నారన్నారు.దేశంలో నిరుద్యోగ ధరలు పోటీపడి పెరుగుతున్న అరికట్టడంలో విఫలమైన మోడీ ప్రభుత్వం మతోన్మాదాన్ని రెచ్చగొట్టి రాజకీయాలు నడుపుతుందని ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేయకుండా రైతాంగం ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకుండా కేంద్రం కొట్టలేదని పేరుతో రాజకీయ డ్రామాలాడుతున్నారని తెలిపారు.2022 జనవరి 22 నుండి 25 వరకు రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్లో జరిగే సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర మూడోమహాసభలు జయప్రద చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మండలకార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి, మండలకమిటీ సభ్యులు కొమ్ములక్ష్మయ్య, నాంపల్లిరమణ, సీహెచ్.నాగభూషణం, పల్లేటి వెంకటయ్య, నాంపల్లిశంకర్, గాదెపాక మధు, పి.లక్ష్మయ్య పాల్గొన్నారు.